టికెట్ కాన్సిల్ చేశాడు.. బంపర్ ఆఫర్ ఇచ్చాడు

మేజర్ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షోలు పడుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కీలకమైన కొన్ని లొకేషన్లలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. విడుదలకు ముందే ఆడియన్స్ కు సినిమాను చూపిస్తున్నారు. కాస్త రిస్క్ అయినప్పటికీ ఇదో మంచి ఎత్తుగడ. సినిమా బాగుంటే రిలీజ్ అయ్యే టైమ్ కు మౌత్ పబ్లిసిటీ పీక్ స్టేజ్ కు చేరుకుంటుంది. రోజుల వ్యవథిలో సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది.

ఇందులో భాగంగా వైజాగ్ లో కూడా ప్రీమియర్ ప్లాన్ చేశాడు అడివి శేష్. చాలామంది టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే ఉన్నట్టుండి, ఉన్నఫలంగా అందరి టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి. టికెట్ కాన్సిల్ అయింది, డబ్బులు వెనక్కి ఇస్తున్నామంటూ బుక్ చేసుకున్నోళ్లందరికీ మెసేజీలు వెళ్లాయి. దీంతో చాలామంది ఖంగుతిన్నారు. అయితే మేటర్ అది కూడా.

వైజాగ్ లో మేజర్ ప్రీమియర్ ను అడివి శేష్ స్పాన్సర్ చేస్తున్నాడు. అందుకే ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో,  వాళ్లందరికీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నాడు. టికెట్ కాన్సిల్ అవ్వలేదని, డబ్బులు మాత్రమే వెనక్కి వస్తున్నాయని,  ఆల్రెడీ టికెట్లు బుక్ చేసిన వాళ్లంతా థియేటర్ కు వచ్చి ఫ్రీగా మేజర్ సినిమా చూడమని ఆఫర్ ఇచ్చాడు శేష్.

అడివి శేష్ వైజాగ్ లో చదువుకున్నాడు. అందుకే మేజర్ సినిమాకు సంబంధించి వైజాగ్ లో సమ్ థింగ్ స్పెషల్  చేస్తానంటూ ఊరిస్తూ వస్తున్నాడు. అదే ఈ స్పెషల్. టికెట్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ ప్రీమియర్ ను ఉచితంగా చూపిస్తున్నాడు.

 

More

Related Stories