ఎఫ్3 బాటలోనే మేజర్ మూవీ

ఈ ఏడాది పెద్ద సినిమాల్లో చివరి చిత్రంగా వస్తోంది ఎఫ్3. ఇప్పటివరకు వచ్చిన ప్రతి పెద్ద సినిమాకు రేట్లు పెంచుకున్నారు. చివరికి కేజీఎఫ్2 లాంటి డబ్బింగ్ సినిమాకు కూడా టికెట్ ధరలు పెంచుకున్నారు. కానీ ఎఫ్3 కోసం టికెట్ రేట్లు పెంచలేదు. కుటుంబ ప్రేక్షకులంతా థియేటర్లకు రావాలనే ఉద్దేశంతో, టికెట్ రేట్లు పెంచడం లేదని నిర్మాత దిల్ రాజు ప్రకటించుకున్నారు. ఇప్పుడిదే బాటలో మేజర్ సినిమా కూడా నడుస్తోంది.

అడివి శేష్ హీరోగా నటించిన సినిమా మేజర్. జూన్ 3న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు కూడా మొదటి వారం రోజులు టికెట్ రేట్ల పెంపు ఉండదని ప్రకటించాడు శేష్. ఇదొక ఎక్స్ టార్డనరీ స్టోరీ అని, సాధారణ ప్రజానీకం మొత్తం ఈ సినిమా చూడాలనే ఉద్దేశంతో టికెట్ రేట్లు పెంచడం లేదని శేష్ ప్రకటించుకున్నాడు.

మొత్తమ్మీద ఎఫ్3 నుంచి రాబోయే ప్రతి సినిమాకు సాధారణ రేట్లే అమలయ్యేలా కనిపిస్తున్నాయి. అంటే సుందరానికి, రామారావు ఆన్ డ్యూటీ, విరాటపర్వం, థాంక్యూ లాంటి సినిమాలకు టికెట్ రేట్లు పెంచకపోవచ్చు. చూస్తుంటే.. సర్కారువారి పాట సినిమాతోనే టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ముగిసినట్టు కనిపిస్తోంది. బహుశా.. పవన్ కల్యాణ్ సినిమా మార్కెట్లోకి వచ్చేవరకు టికెట్ రేట్ల పెంపు ఉండకపోవచ్చు. 

 

More

Related Stories