రెండు డిసాప్పాయింట్మెంట్ల తర్వాత…!

Chiranjeevi


మెగాస్టార్ చిరంజీవి మొత్తానికి భారీ హిట్ అందుకున్నారు. అమెరికాలో ‘వాల్తేర్ వీరయ్య’ 2 మిలియన్ (16 కోట్ల రూపాయల పై చిలుకు) డాలర్ల క్లబ్ లో చేరింది. ఇండియాలో కూడా మొదటి వారం వసూళ్లు భారీగా వచ్చాయి. ఏ రకంగా చూసినా ‘వాల్తేర్ వీరయ్య’ పెద్ద హిట్. మెగాస్టార్ చిరంజీవి సత్తా మరోసారి చూపించింది ఈ సినిమా.

నిజానికి చిరంజీవికి ఈ మధ్య సరైన హిట్ లేదు. ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో చిరంజీవి మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. అది సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత ‘సైరా నరసింహా రెడ్డి’లో నటించారు. అది వసూళ్ల పరంగా భారీగానే రాబట్టుకున్నా …పెట్టిన ఖర్చుకు, వచ్చిన వసూళ్ల లెక్క చూస్తే నష్టమే.

ఇక ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ‘ఆచార్య’ ఘోర పరాజయం చూసింది. ఆ తర్వాత ‘గాడ్ ఫాదర్’ సినిమాకి మంచి రివ్యూస్, టాక్ వచ్చింది… కానీ వసూళ్లు అంతగా రాలేదు. ఓవరాల్ గా గతేడాది విడుదలైన ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ సినిమాలు నిరాశపర్చాయి.

అందుకే, ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా విడుదల టైములో పెద్దగా అంచనాలు లేవు. పాస్ అయితే చాలు అనుకున్నారు మెగాభిమానులు. అన్యూహ్యంగా ఈ సినిమా భారీ హిట్ అయింది. రెండు డిసాప్పాయింట్మెంట్ల తర్వాత హిట్ రావడంతో చిరంజీవి చాలా ఖుషీగా ఉన్నారు.

ఇక తమన్నతో స్టెప్పులు

మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇంకో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం ‘భోళా శంకర్’ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో కూడా పాటలు అదిరిపోయేలా ఉండేలా జాగ్రత్తలు చూసుకుంటున్నారట. ‘వాల్తేర్ వీరయ్య’లో రెండు పాటలు బాగా క్లిక్ అయ్యాయి. ‘వాల్తేర్’లో శృతి హాసన్ చిరంజీవి సరసన నటిస్తే, ‘భోళా శంకర్’లో తమన్న నటించనుంది. తమన్న మంచి డ్యాన్సర్. సో, చిరంజీవి, తమన్న డ్యాన్స్ లు అదిరిపోతాయి అనుకోవచ్చు.

ప్రస్తుతం తమన్న ఖాతాలో ఉన్న ఏకైక బడా తెలుగు చిత్రం ఇదే. ప్రస్తుతం ఆమె మలయాళం, హిందీ సినిమాల్లో బిజీగా ఉంది.

 

More

Related Stories