
హీరోల వయసు ఎంతైనా నాకు ఇబ్బంది లేదు అంటోంది తమన్న. ఆమె తాజాగా ఇద్దరు సీనియర్ హీరోల సరసన నటించింది. ఆ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అవే “జైలర్”, “భోళా శంకర్” చిత్రాలు.
“భోళా శంకర్” సినిమాలో చిరంజీవి సరసన ఆమె నటించింది. “జైలర్”లో ఆమె రజినీకాంత్ కి జోడి. చిరంజీవి వయసు 67. ఇక రజినీకాంత్ వయసు 72. తమన్న వయసు కేవలం 33. అంటే వారి వయసులో ఆమెది సగం కూడా కాదు. సీనియర్ హీరోలతో నటించినా, యంగ్ హీరోలతో నటించినా… ఏదైనా సినిమానే, నటన కదా అని ప్రశ్నిస్తోంది. అందుకే హీరోల వయసు ఎంత అనేది తనకు అనసవరం అంటోంది.
తమన్న ఇంతకుముందు 60 ప్లస్ వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో కూడా నటించి విజయాలు అందుకొంది. అంతే కాదు, తాను కూడా ఆ వయసుకి చేరుకున్న తర్వాత అలాగే డ్యాన్స్ చెయ్యాలని కోరుకుంటుందట. అంటే ఈ అమ్మడి టార్గెట్ పెద్దదే.
తమన్న ఆర్గ్యుమెంట్ లో నిజం ఉంది. కానీ, స్క్రీన్ పై మాత్రం కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది అనేది కూడా వాస్తవమే. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో శ్రీదేవి నటించినట్లు ఇప్పుడు తమన్న చేస్తోంది.