
అఖిల్ హీరోగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తీస్తున్న సినిమా …ఏజెంట్. ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది. షూటింగ్ గ్యాప్ లో హీరో, డైరెక్టర్ పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ మాటలు కలుపుతున్న వేళ …కెమెరా క్లిక్ మంది. ఆ ఫొటోను అఖిల్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
“ఇలాంటి క్షణాల కోసమే బతుకుతాను… ” అంటూ అఖిల్ కామెంట్ కూడా రాశాడు
అఖిల్ ఈ సినిమా కోసం ఫుల్లుగా బాడీని పెంచాడు. కండలు, సిక్స్ ప్యాకులు… మొత్తంగా మారిపోయాడు. ఇది యాక్షన్ డ్రామా. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ఇప్పటివరకు అతను నటించిన ఏ సినిమా ఆడలేదు. నాలుగో సినిమాగా రూపొందుతోన్న “మోస్ట్ ఎలిజిబులు బ్యాచిలర్” ఇంకా పూర్తి కావట్లేదు. ఆ మూవీపై జనం కూడా అంచనాలు పెట్టుకోవడం లేదు. ఇప్పటివరకు విడుదలైన పాటలు కానీ, టీజర్ కానీ క్లిక్ కాలేదు. ఆ సినిమాపై అఖిల్ కూడా ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది.
‘ఏజెంట్’ సినిమాని దేశ, విదేశాల్లో తీయనున్నారు. సురేందర్ రెడ్డి కూడా ఈ సినిమాకి నిర్మాత.