ఈ ఎక్స్ట్రాలే వద్దు!

అల్లు అర్జున్ పేరు ముందు మెగాస్టార్ అన్న ట్యాగ్ ని తగిలించి ఎక్స్ ట్రాలకు పోయింది ఆహా అనే OTT కంపెనీ. “మన సారే” కదా అని ఓవర్ చేసింది. కానీ మెగాస్టార్ ఫాన్స్ “ఈ ఎక్స్ట్రాలు తగ్గించుకుంటే మంచిది” అని గూబ గుయ్యిమనిపించారు. దెబ్బకు “ఎవరైతే హర్ట్ అయ్యారో వాళ్ళకి” క్షమాపణలు చెప్పింది.

“మెగాస్టార్ ఉన్నది ఒక్కరే… ఆయనెవరో మీకు, మాకు అందరికి తెలుసు” అంటూ ఓ కవరింగ్ కూడా ఇచ్చుకుంది.

ఈ గొడవంతా… అల్లు అర్జున్ ని మెగాస్టార్ అని పిలవడంతో జరిగింది. అల్లు అర్జున్ ని సమంత ఇంటర్వ్యూ చేసింది. ఆ ఎపిసోడ్ ని ప్రచారం చేసుకునేందుకు వేసిన పోస్టర్లు, ట్వీట్స్ లలో అల్లు అర్జున్ ని మెగాస్టార్ అని డిక్లేర్ చేసింది. దాంతో, మెగాభిమానులకు మండింది. “మెగాస్టార్ అంటే చిరంజీవి మాత్రమే….. ఇలా చేస్తే ఊరుకోము,” మెగాస్టార్ ఫాన్స్ ట్వీట్లు వేశారు. బన్నీని బ్రహ్మానందం ఫేస్ తో ట్రోల్ చేశారు. దాంతో మరింత డ్యామేజ్ జరగకుండా ఒక క్షమాపణల ట్వీట్ వేసింది.

“ఆహా”లో అల్లు కుటుంబం పెట్టుబడులు కూడా ఉన్నాయి.

More

Related Stories