కృష్ణంరాజు మృతికి కారణం ఇదే

Krishnam Raju

రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వా స విడిచారు.

కార్డియాక్ అరెస్ట్ వల్లే కృష్ణంరాజు మృతి చెందినట్లు ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. గత నెలలో ఆయనకి కోవిడ్ సోకింది.

‘‘82 ఏళ్ల కృష్ణంరాజు మధుమేహం, కోవిడ్ అనంతర సమస్యల వల్ల కార్డియాక్ అరెస్ట్ కావడంతో చనిపోయారు. చాలా కాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స జరిగింది. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలూ ఉన్నాయి. కోవిడ్ సమస్యతో గత నెల 5వ తేదీన ఆస్పత్రిలో చేరారు. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బ తినడంతో ఆస్ప త్రిలో చేరినప్పటి నుంచి వెంటిలేటర్ పై చికిత్స అందించాం. ఆదివారం తెల్లవారుజామున 3.16గం టలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు.” – ఇది హాస్పిటల్ ప్రకటన సారాంశం.

నిన్నటి నుంచి ఆసుపత్రిలోనే ఉన్నారు ప్రభాస్. పెద్దనాన్న పరిస్థితి విషమించింది అన్న కబురుతో ఆయన శనివారం సాయంత్రానికే ఆసుపత్రికి వచ్చారు.

సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి అని కుటుంబ సభ్యులు ప్రకటించారు.

 

More

Related Stories