
సుశాంత్ ను ఎవ్వరూ హత్య చేయలేదట
సుశాంత్ కేసులో ఎన్నో అనుమానాలు, మరెన్నో ఊహాగానాలు చెలరేగుతున్న వేళ.. వాటికి మరింత ఊతమిస్తూ.. ఈరోజు ఎయిమ్స్ వైద్యుల బృందం సీబీఐకి తమ పోస్టుమార్టం, విసేరా రిపోర్ట్ ను అందజేసింది. దీనిపై కూడా అప్పుడే జాతీయ మీడియాలో కథనాలు మొదలయ్యాయి.
ఎన్డీటీవీ కథనం ప్రకారం.. ఎయిమ్స్ చెప్పిందట. అతడిపై ఎలాంటి విషప్రయోగం జరగలేదని, అది పూర్తిగా ఆత్మహత్య అయి ఉంటుందని ఎయిమ్స్ వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారట.
కొన్ని రోజుల కిందట సుశాంత్ తండ్రి కేకే సింగ్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ ఓ సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ చనిపోయిన వెంటనే తీసిన ఫొటోలు కొన్నింటిని వికాస్ సింగ్, ఓ ఎయిమ్స్ వైద్యుడికి పంపించారట. ఆ ఫొటోల్ని పరిశీలించిన ఎయిమ్స్ డాక్టర్ అది హత్య అని నిర్థారించినట్టు సదరు లాయర్ ఆరోపించారు.
ఈ ఆరోపణలు బయటకొచ్చిన కొన్ని రోజులకే సుశాంత్ పై ఎలాంటి విషప్రయోగం జరగలేదని, హత్య ఆనవాళ్లు లేవంటూ ఎయిమ్స్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.