
ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య విడిపోతున్నట్టు ప్రకటించి నెల రోజులు కావొస్తోంది. నెల తర్వాత కూడా వారి నిర్ణయంలో మార్పు లేదని టాక్. రజినీకాంత్ ఇద్దరినీ కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ, కూతురు ఇష్టప్రకారం తీసుకున్న నిర్ణయం అని రజినీకాంత్ కూడా ఇక ఆ మేటర్ ని వదిలేసినట్లు సమాచారం.
ధనుష్, ఐశ్వర్య విడాకుల ప్రకటన తర్వాత రజినీకాంత్ మొదటిసారిగా ఈ రోజు బయటికి వచ్చారు. నవ్వుతూ కనిపించారు.ఆయన మళ్ళీ సినిమాలతో బిజీ కానున్నారు. ఇప్పటికే కొత్త సినిమా ప్రకటించారు.
ఐశ్వర్య ఇక తన తండ్రి సినిమాలలో ఇన్వాల్వ్ అవుతుందట.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె కొన్ని కామెంట్స్ చేసింది. అందులో ఆమె చెప్పిన మాటలను బట్టి చూస్తే ధనుష్ ది ఆమె జీవితంలో ముగిసిన అధ్యాయం. “ప్రేమ అనేది ఒక వ్యక్తితో ముడిపడదు. నేను మా నాన్న ప్రేమిస్తా. మా అమ్మని ప్రేమిస్తా. నా ఇద్దరు కొడుకులని ప్రేమిస్తా. ప్రేమ అనేది వయసుతో పాటు, మన పరిణితి చెందడం బట్టి మారుతుంది,” అని చెప్పింది.