‘సబ్బులు అమ్ముకొని బతుకుతున్నా’

Aishwarya Bhaskaran


ఒక హీరోయిన్ బతుకు తెరువు కోసం ఇంటి ఇంటికి తిరిగి సబ్బులు అమ్ముకుంటుంది అంటే షాకింగ్ అనిపిస్తుంది కదా! కానీ, తాను అది పనే చేస్తున్నా అని ఒక మాజీ హీరోయిన్ చెప్తోంది. ఆమె మాటల్లో నిజమెంతో కానీ డబ్బులు లేక ఇలా చేస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఒకప్పటి హీరోయిన్ ఐశ్వర్య.

“డబ్బులు లేవు. అవకాశాలు రావడం లేదు. బతకడం కోసం ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్ముతున్నా. ప్రస్తుతం రోడ్ మీద బతుకుతున్నా. మీరు (ఇంటర్వ్యూ చేసిన మీడియా కంపెనీ) స్వీపర్ గా పని ఇచ్చినా రేపే జాయిన్ అవుతా,” అంటూ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించిందిఐశ్వర్య.

అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న విషయం చెప్పడానికి ‘సబ్బులు అమ్ముకుంటున్నా’ అని కొంచెం అతిగా చెప్పినట్లు కనిపిస్తోంది. అసలు ఈ రోజుల్లో సూపర్ మార్కెట్ లో కాకుండా ఎవరో వచ్చి సబ్బులు అమ్మితే కొనేవాళ్ళు నగరాల్లో ఉంటారా?

‘ప్రేమ జిందాబాద్’, ‘మామగారు’, ‘బ్రహ్మ’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గ నటించారు ఐశ్వర్య. ఇక ‘నాని’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘ఝుమ్మంది నాదం’, ‘ఓ బేబి’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు ఆమె. తమిళంలో ఒకప్పుడు హీరోయిన్ గా బాగా పాపులర్. సినిమాలు కాకుండా బుల్లితెరపై కూడా అనేక సీరియల్స్, షోలలో ఆమె కనిపించిన విషయం తెలిసిందే.

50 ఏళ్ళు ఆమెకిప్పుడు. చాలా కాలం క్రితమే భర్తతో విడిపోయిన ఐశ్వర్య ఇప్పుడు అవకాశాలు కావాలంటున్నారు. ఆమెకి ఒక కూతురు కూడా ఉంది. ఆమె తల్లి లక్ష్మి గ్రేట్ యాక్టర్.

ఇన్నాళ్లూ సంపాదించుకున్న డబ్బు ఏమైందో మాత్రం ఆమె తెలపలేదు. ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నట్లు అర్థం అవుతోంది.

 

More

Related Stories