విడాకుల రూమర్లపై ఐశ్వర్య మౌనం!

Aishwarya Rai

ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె భర్త అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారు అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు అధికారికంగా విడిపోయారు అని సోషల్ మీడియాలో వార్తలు రౌండ్లు తిరుగుతున్నాయి. మూడు, నాలుగు రోజులుగా ప్రధాన పత్రికల్లో కూడా వార్తలు వస్తున్నాయి. అయినా ఐశ్వర్య రాయ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అబద్దమని తోసిపుచ్చలేదు. నిజమని అంగీకరించలేదు.

Advertisement

ఐశ్వర్య రాయ్ ఇటీవలే 50వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆ పుట్టిన రోజు వేడుకల్లో బచ్చన్ ఫ్యామిలీ సందడి పెద్దగా కనిపించలేదని టాక్. దానికి తోడు ఎప్పుడూ వేలికి వెడ్డింగ్ రింగ్ తొడుక్కునే అభిషేక్ బచ్చన్ ఇటీవల రింగ్ లేకుండానే అన్ని చోట్లా కనిపిస్తున్నాడట. ఈ రెండు కారణాలు చెప్పి వాళ్ళు విడిపోయారు అని సోషల్ మీడియా జనం తీర్మానించారు.

ఈ సోషల్ మీడియా టాక్ ని బట్టి మీడియా కూడా వార్తలు ప్రచురించింది. అయినా అటు ఐశ్వర్య నుంచి, ఇటు బచ్చన్ కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

అభిషేక్, ఐశ్వర్య 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. ఐశ్వర్య ఎక్కువగా తన ఇన్ స్టాగ్రామ్ లో తన కూతురు ఆరాధ్య ఫోటోలు షేర్ చేస్తుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో తమ 16వ పెళ్లి రోజు నాడు ఐశ్వర్య “స్వీట్ సిక్స్టీన్” అంటూ అభిషేక్ ని కౌగిలించుకొని ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఆ తర్వాత అభిషేక్ ఫోటో షేర్ చెయ్యలేదు.

ఐతే, గత నెల (నవంబర్ 1) ఐశ్వర్య 50వ పుట్టిన రోజునాడు అభిషేక్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫోటో షేర్ చేసి విషెష్ తెలిపాడు. నెల రోజుల్లోనే వారి విడాకులు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో నిజానిజాలు ఎంతో చూడాలి.

Advertisement

More

Related Stories