ఐశ్వర్య ఆ మెరుపు పోయింది!

ఐశ్వర్యరాయ్ అంటే అతిలోక సుందరి. ఒకప్పుడు శ్రీదేవికి ఎలా ‘అతిలోక సుందరి’ అనే పేరు ఉండేదో ఐశ్వర్యకి అలా ప్రపంచ సుందరిగా గుర్తింపు ఉంది. ఆమె అందం అట్లాంటి ఇట్లాంటిది కాదు. పెళ్లయి, ఒక అమ్మాయికి జన్మ ఇచ్చిన తర్వాత కూడా ఐశ్వర్య తన అందచందాలతో ఆకట్టుకొంది.

ఐతే, ఇటీవల ఆమె బాగా బరువు పెరిగినట్లు కనిపిస్తోంది. ఆదివారం హైదరాబాద్ కి ‘పీఎస్ 2’కి వచ్చినప్పుడు ఆమెలో మునుపటి అందం మొత్తం పోయినట్లు అనిపించింది.

ముఖ్యంగా ఆమె ముఖం బాగా ఉబ్బడం వల్లే ఆ చార్మ్ పోయింది. మలైక అరోరా వంటి హీరోయిన్లు 49వ వయసులో కూడా ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుండగా ఐశ్వర్య అలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నట్లు కనిపించడం లేదు. వయసుతో పాటు బరువు పెరగడం సహజమే. ఆమెకిప్పుడు 49 ఏళ్లు.

ఐతే, ఐశ్వర్య రాయ్ ఇప్పటికీ కూడా స్లిమ్ ఐతే మునుపటిలా మెప్పిస్తుందని అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

 

More

Related Stories