
పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ సినిమాలో ఒక హీరోయిన్ కన్ఫర్మ్ అయింది. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. ఈ విషయాన్నీ మేకర్స్ చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ సరసన నటించేది ఎవరు? అదే ఇంకా తేలలేదు. సాయి పల్లవి రిజెక్ట్ చేసింది. దాంతో, పవన్ కళ్యాణ్ సరసన ఎవరిని నటింప చెయ్యాలనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట.
ఐశ్వర్య రాజేష్… ఇప్పటికే తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘వరల్డ్ ఫేమస్ లవర్.’ సినిమాలో నటించింది. వచ్చే నెలలో విడుదల కానున్న ‘టక్ జగదీష్’ సినిమాలో రెండో హీరోయిన్ గా కనిపిస్తుంది. నానికి మరదలుగా నటిస్తోంది. ఇప్పుడు రానా సరసన కనిపించనుంది.
Also Check: Aishwarya Rajesh’s glam side
తమిళ సినిమా రంగంలో ఇప్పటికే ఆమె హీరోయిన్ గా మంచి పొజిషన్లో ఉంది. తెలుగులో ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది.