రష్మికని కించపర్చలేదు: ఐశ్వర్య

Aishwarya Rajesh

హీరోయిన్ రష్మిక మందానకి నటన రాదు అన్నట్లుగా ఐశ్వర్య రాజేష్ చేసిన మాటలు కలకలం రేపాయి. “పుష్ప 2 సినిమాలో నన్ను తీసుకొని ఉంటే శ్రీవల్లి పాత్రకు న్యాయం చేసేదాన్ని,” అని ఐశ్వర్య రాజేష్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. ఆమె మాటలు వైరల్ కావడంతో ఇప్పుడు ఆమె వివరణ ఇచ్చింది.

తన మాటలను వక్రీకరించారు అని చెప్పింది.

రష్మిక చేసిన ‘శ్రీవల్లి’ వంటి పాత్రలు నాకు బాగా సూట్ అవుతాయి అని మాత్రమే చెప్పాను కానీ రష్మిక గురించి నెగెటివ్ గా మాట్లాడలేదు అని ఈ లెటర్ లో ఆమె పేర్కొంది.

“తెలుగులో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు అని ఇంటర్వ్యూలో అడిగారు. “పుష్ప” శ్రీవల్లి వంటి పాత్రలు నాలాంటి వాళ్లకు బాగా నప్పుతాయి అని మాత్రమే చెప్పాను. కానీ ప్రచారం జరిగింది మాత్రం వేరుగా. నిజానికి “పుష్ప”లో రష్మిక యాక్టింగ్ బాగుంది. నాకు నచ్చింది. ఆమె నటనని తప్పు పట్టలేదు. నేను అలాంటి పాత్రలకు తెలుగులో సూట్ అవుతాను అని మాత్రమే చెప్పాను,” అని వివరించింది.

Aishwarya Rajesh

ఆమె తండ్రి రాజేష్ ఒకప్పుడు హీరో. ఆయన తెలుగువారే. ఒకప్పటి ఫేమస్ హాస్యనటి శ్రీలక్ష్మి ఐశ్వర్య రాజేష్ కి మేనత్త. ఐతే, ఈ అమ్మడికి తమిళంలో స్టార్ డం వచ్చింది. కానీ తెలుగులో పెద్దగా ఆఫర్లు దక్కట్లేదు.

Advertisement
 

More

Related Stories