
ఐశ్వర్య రాజేష్ మంచి నటి. అభినయంతో పేరు తెచ్చుకున్న భామ. తమిళంలో ఆమె హీరోయిన్ గా స్థిరపడింది. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ తెలుగమ్మాయికి తెలుగులో రాణించాలని కోరిక. ఆమె అభిలాషకి తగ్గట్లే తెలుగులో అవకాశాలు బాగానే వస్తున్నాయి.
తెలుగులో ఆమె ఇప్పటివరకు నటించిన సినిమా ఏదీ పెద్దగా ఆడలేదు. విజయ్ దేవరకొండ సరసన నటించిన “వల్డ్ ఫేమస్ లవర్” దారుణ పరాజయం చూసింది. “కౌసల్య కృష్ణమూర్తి” అనే సినిమాకి పేరు వచ్చినా.. కాసులు రాలేదు.
అయినా.. తెలుగు ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఆమెకి మంచి అవకాశాలు ఇస్తున్నారు. నాని హీరోగా నటిస్తున్న “టక్ జగదీష్”లో ఆమెది మరదలు పాత్ర. మెయిన్ హీరోయిన్లలో ఒకరు. ఇక దేవా కట్ట తీస్తున్న పొలిటికల్ డ్రామాలో కూడా సాయి ధరమ్ తేజ్ సరసన నటించే అఫర్ వచ్చిందిట.
మొత్తానికి ఈ భామ మిడిల్ రేంజ్ హీరోల చిత్రాల్లో అభినయానికి స్కోపుండే పాత్రలు దక్కించుకుంటోంది.