
హీరో సాయితేజ్, దర్శకుడు దేవ్ కట్టా కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం… ‘రిపబ్లిక్’. ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్టోబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమాలోని ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ వరుసగా పోస్టర్లని విడుదల చేస్తూ వస్తోంది టీం. తాజాగా హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ లుక్ కి సంబందించిన పోస్టర్ విడుదలయింది.
సాయితేజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ లుక్ పోస్టర్స్‌ను ఇప్పటికే రిలీజ్ చేశారు. మైరా హన్‌సన్ అనే పాత్ర పోషిస్తోంది ఐశ్వర్యా రాజేష్. ఆమె మంచి నటనకి పెట్టింది పేరు. “కూలిపోతాం.. కుంగిపోతాం, ఓడిపోతాం! అయినా… నిలబడతాం, కోలుకుంటాం, గెలుస్తాం!’’ అని పోస్టర్‌పై లైన్స్ ఉంచారు. ఆమె పాత్ర తాలూకు స్వభావం ఎలా ఉంటుందో సులువుగా అర్థం అవుతోంది.
సాయితేజ్ యాక్టింగ్, దేవ్ కట్టా మార్క్ టేకింగ్, డైలాగ్స్‌తో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఐశ్వర్య రాజేష్ తెలుగులో ఇప్పటివరకు ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘కౌసల్యా కృష్ణమూర్తి’, ‘టక్ జగదీష్’ చిత్రాల్లో నటించింది. ఇక పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాలో రానా సరసన ఆమె నటిస్తోంది.