
ఐశ్వర్య రజినీకాంత్ అంటూ తన పేరుని మార్చేశారు ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య. ట్విట్టర్లో మొన్నటి వరకు ఐశ్వర్య ధనుష్ అనే పేరునే ఉంచారు ఆమె. నిన్న (మార్చి 21) ధనుష్ ఆనవాళ్లు లేకుండా ఐశ్వర్య రజినీకాంత్ గా మార్చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ఇంకా మార్చలేదు. అది కూడా ఇన్ స్టాగ్రామ్ టీంతో మాట్లాడి మార్చేస్తారని టాక్.
ఐతే, ధనుష్ తో రాజీపడి మళ్ళీ కలిసిపోతారన్న ప్రచారానికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టారు. ఆమె దారి ఆమెది, అతని దారి అతనిది. ఇందులో మార్పు లేదు.
ఐశ్వర్య పూర్తిగా డైరెక్షన్ పై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఆమె తన తొలి హిందీ చిత్రాన్ని ప్రకటించారు. ఆమె డైరెక్ట్ చేయనున్న హిందీ చిత్రం.. “ఓ సాథి చల్”. త్వరలోనే హీరో, హీరోయిన్ల పేర్లని ప్రకటిస్తారట.
ఐతే, విడాకుల విషయంలో లీగల్ ప్రాసెస్ మాత్రం జరగలేదు.
ఐశ్వర్య, ఐశ్వర్య ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్,