- Advertisement -

మళ్ళీ కలిసిపోతారులే అనుకున్నారు అభిమానులు. పెద్దలు రంగంలోకి దిగారట అని మీడియాలో వార్తలు. కానీ, ఫైనల్ గా తేలింది ఏంటంటే ఎవరి దారి వారిదే. ఇదంతా ధనుష్, ఐశ్వర్య గురించే.
జనవరి 17న ధనుష్, ఐశ్వర్య తమ సోషల్ మీడియా వేదికలపై విడిపోతున్నట్లు ప్రకటించారు. రెండు నెలల తర్వాత ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య అందరికీ క్లారిటీ ఇచ్చింది. ధనుష్ పేరుని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి మొత్తంగా తొలగించేసింది. మార్చి 21న ట్విట్టర్ లో మార్చేసింది. మార్చి 24న ఇన్ స్టాగ్రామ్ లో తీసేసింది.
ఇప్పుడు అన్ని చోట్లా ఆమె తన పేరుని ఐశ్వర్య రజినీకాంత్ అని రాసుకుంటోంది. సోషల్ మీడియాలోనూ అదే పేరు, అదే ఐడి. ధనుష్ పేరుని తీసేసింది.
ఇక ధనుష్, ఐశ్వర్య కలిసిపోతారనే భ్రమలు తొలిగించుకున్నారు వారి అభిమానులు.