కన్నడ వైపు చూపు


కన్నడ సినిమాలు ఒక్కసారిగా దేశమంతా సంచలనం సృష్టిస్తున్నాయి. ‘కేజీఎఫ్ 2’ సినిమా రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కన్నా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాకి పనిచేసిన రవి బస్రుర్ ఇప్పుడు రెండు తెలుగు సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. అతనిలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలి అని దర్శకులు మ్యూజిక్ డైరెకర్లని అడుగుతున్నారు.

రవిలా మరో కన్నడ సంగీత దర్శకుడు కూడా తెలుగులో బిజీ కానున్నాడు. అతనే అజనీష్ లోక్‌నాథ్.

సాయితేజ్ నటిస్తున్న కొత్త చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విక్రాంత్ రోణ, కాంతారా చిత్రాలకు సంగీతం అందించిన ఈ మ్యూజిక్ దర్శకుడు ఇప్పుడు తెలుగు వాళ్ళ దృష్టిలో పడ్డాడు.

బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ వద్ద రచన విభాగంలో పనిచేసిన కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకుడు.

తమన్, దేవిశ్రీ ప్రసాద్ కొన్ని సినిమాలకు మాత్రమే మంచి సంగీతం ఇస్తున్నారు. మిగతావాళ్ళు బ్యాగ్రౌండ్ స్కోర్ లో పూర్. అందుకే, ఇప్పుడు తెలుగు వాళ్ళ చూపు కన్నడ సినిమా వైపు పడింది.

Advertisement
 

More

Related Stories