ప్రణీతకి కూడా అజయ్ సపోర్ట్?

Pranitha Subash

బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ఇటీవల తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తున్న భామలతో ఎక్కువగా జతకడుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కి వరుసగా మూడు సినిమాల్లో అవకాశాలు ఇచ్చాడు. లేటెస్ట్ గా ప్రణీత సుభాష్ తో నటిస్తున్నాడు.

‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ప్రణీతకి తెలుగులో ఇప్పడు ఆఫర్లు నిల్. కానీ బాలీవుడ్ లో ఏకంగా అజయ్ దేవగణ్ కొత్త సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘బుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాలో ఆమె అజయ్ దేవగన్ కి జోడి.

ప్రణీతకి తెలుగులో కెరీర్ ఎండ్ అయినట్లే. సౌత్ లో ఆమెకి అవకాశాలు దక్కకపోయినా బాలీవుడ్ వెల్కమ్ చెపుతోంది.

Also Check: Pranitha Subhash’s Latest Photos

More

Related Stories