అజిత్ 50వ బర్త్ డే స్పెషల్

తమిళ సూపర్ స్టార్ అజిత్ ఈ ఏడాది 50వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ‘ప్రేమలేఖ’ వంటి రొమాంటిక్ చిత్రాలతో ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ పొందిన అజిత్ ఇప్పుడు మాస్ హీరో. తమిళనాడులో రజినీకాంత్ తర్వాత అత్యంత మాస్ ఫాలోయింగ్ ఉన్నది విజయ్, అజిత్ లకే. అజిత్ వివాదరహితుడు. సింప్లిసిటీకి మారుపేరు. 50వ పుట్టిన రోజుని కూడా ఎటువంటి హంగామా లేకుండా సింపుల్ గానే జరుపుకోనున్నాడట.

ఐతే, ఆయన నిర్మాతలు మాత్రం ఈ స్పెషల్ డే నాడు ఆయన అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. అజిత్ ప్రస్తుతం ‘వలిమై’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి బోనీ కపూర్ నిర్మాత. “అజిత్ 50వ బర్త్ డే స్పెషల్ గా ఆ రోజు వలిమై ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నాం. ప్రమోషన్స్ కూడా అప్పుడే షురూ,” అని బోనీ కపూర్ ప్రకటించాడు.

దాంతో అజిత్ అభిమానులు ఖుషీఖుషీగా సోషల్ మీడియాలో ట్రెండింగులతో హోరెత్తిస్తున్నారు.

More

Related Stories