అజిత్ కి జరిగింది ఆ సర్జరీ కాదు!

Ajith

తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకి ఇటీవల సర్జరీ జరిగింది. సర్జరీ విజయవంతం అయింది. రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఈ రోజు డిశ్చార్జ్ అయినట్లు సమాచారం.

ఆయనకి సర్జరీ జరిగింది అని మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదు ఆయన అజిత్ మేనేజర్ మీడియాకి తెలిపారు. ఆయన చెవి కింద నెర్వ్స్ చాలా వీక్ గా ఉన్నట్లు డాక్టర్లు గుర్తించి అక్కడ సర్జరీ చేసి జారీచేసినట్లు ఆయన తెలిపారు.

బ్రెయిన్ సర్జరీ అనే ప్రచారంలో నిజం లేదు అని ఆయన అన్నారు. అజిత్ కి అనేక ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఆయనకి గతంలో వెన్నుముక దెబ్బతింది ఒక యాక్సిడెంట్ లో. అప్పుడు సర్జరీ జరిగింది. అందుకే ఆయన ఎక్కువగా డ్యాన్స్ చెయ్యరు. ఐతే ఆయనకి బైక్ రైడింగ్ అంటే మక్కువ. ఇప్పటికే దేశమంతా బైక్ మీద తిరిగారు.

ఐతే ఇప్పుడు అజిత్ తన ఆరోగ్యం విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన త్రిషతో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆ షూటింగ్ సగభాగం పూర్తి అయింది.

 

More

Related Stories