సింప్లిసిటీకి మారుపేరు…అజిత్

Ajith Kumar

నేడు తమిళ అగ్రహీరో అజిత్ పుట్టినరోజు. ఆయన ఇప్పుడు 50లోకి అడుగుపెడుతున్నారు. 1971 మే 1న జన్మించారు అజిత్‌. పుట్టింది హైదరాబాద్ లోనే. కానీ వారి తమిళీయులే. 1990లో ‘ఎన్‌ వీడు ఎన్‌ కనవర్‌’ అనే తమిళ చిత్రంతో పరిచయం. అందులో చిన్న పాత్ర. హీరోగా అజిత్ ఒప్పుకున్న మొదటి మూవీ… గొల్లపూడి మారుతి రావు కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ దర్శకుడిగా తీసిన ప్రేమ పుస్తకం’ ఐతే, ఆ మూవీ షూటింగ్ సమయంలోనే శ్రీనివాస్ కన్నుమూశారు. దాంతో సినిమా విడుదల ఆలస్యం అయింది. దాంతో, ‘అమరావతి’ తమిళ సినిమా మొదట విడుదలైంది.

మణిరత్నం నిర్మించిన ‘ఆశ …ఆశ …ఆశ’ మొదటి హిట్ మూవీ. కానీ అజిత్ కి హీరోగా రియల్ బ్రేక్ ఇచ్చింది మాత్రం… ‘ప్రేమలేఖ’ (కాదల్ కోట్టై). తమిళ, తెలుగు భాషల్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ‘వాలి’ మరో బ్లాక్ బస్టర్. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొదట తన హ్యాండ్సమ్ లుక్స్ రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. గత కొన్నేళ్లుగా ఆయన నటిస్తున్న ప్రతి మూవీ సూపర్ హిట్టే.

ఇప్పుడు తమిళ్ లో రజినీకాంత్, కమల్ హాసన్ తరం తర్వాత… బిగ్ సూపర్ స్టార్లు ఇద్దరే. ఒకరు విజయ్. మరొకరు అజిత్ కుమార్.

హీరోయిన్ షాలినిని పెళ్లి చేసుకున్న అజిత్ లైఫ్ స్టైల్ డిఫరెంట్. సింప్లిసిటీకి మారుపేరు. అజిత్, షాలినికి ఇద్దరు పిల్లలు. అజిత్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

More

Related Stories