
సూపర్ స్టార్ రజినీకాంత్, మరో తమిళ అగ్ర హీరో అజిత్ కుమార్ పోటీ పడనున్నారట. వీరి ఇద్దరి సినిమాలు ఈ దీపావళికి పోటాపోటీగా విడుదల కానున్నాయి.
రజినీకాంత్ ‘అన్నత్తే’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కానుంది. అలాగే, అజిత్ ‘వలిమై’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. తాజా సమాచారం ప్రకారం ‘వలిమై’ కూడా నవంబర్ 4నే థియేటర్లలోకి రానుంది.
ఈ ఏడాది విజయ్ నటించిన మాస్టర్ తమిళనాడులో భారీ విజయం సాధించింది. అదొక్కటే తమిళనాడు థియేటర్లో ఆడింది ఈ కరోనా కాలంలో. మళ్ళీ బాక్సాఫీస్ కి ఊపు రావాలంటే పెద్ద సినిమాలు విడుదల కావాలి. తమిళనాట దీపావళి, సంక్రాంతి పెద్ద పండుగలు. దీపావళికి రెండు సినిమాలు పోటీ పడడం అనేది ఎప్పటినుంచో ఉంది. ఐతే, ఈ కరోనా సంక్షోభ కాలంలో రెండు పెద్ద సినిమాలను ఒకే రోజు విడుదల చెయ్యడం ఎంతవరకు కరెక్ట్?
‘వలిమై’ నిర్మాత బోనీ కపూర్ ఈ సినిమా విడుదల గురించి ఇంకా అఫీషియల్ గా డేట్ చెప్పలేదు. కానీ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం దీపావలికి విడుదల చేస్తాను అని చెప్తున్నారట.