
అజిత్ హీరోగా మరో సినిమా ప్రకటన వచ్చింది. ఆయన నటించే 62వ చిత్రానికి విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తాడు. విగ్నేష్ శివన్ ఎవరో కాదు హీరోయిన్ నయనతార ప్రియుడు.
నయనతార, విగ్నేష్ శివన్ సహజీవనం సాగిస్తున్నారు అనే విషయం అందరికీ తెలుసు. అతను ఇప్పటికే సూర్య హీరోగా ‘గ్యాంగ్’ అనే చిత్రం తీశాడు. నయనతార, సమంత, విజయ్ సేతుపతిలతో ఒక రొమాంటిక్ చిత్రం కూడా రూపొందించాడు. ఇప్పుడు ఏకంగా అజిత్ ని డైరెక్ట్ చెయ్యబోతున్నాడు.
లైకా సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తాడు. అజిత్ ఇటీవల నటించిన ‘వలిమై’ చిత్రం తమిళంలో యావరేజ్ గా ఆడింది. తెలుగులో ఢమాల్. ప్రస్తుతం తమిళనాట బాగా మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఇద్దరే. ఒకరు విజయ్. మరొకరు అజిత్.
అజిత్ తో సినిమా ఆఫర్ రావడంతో విగ్నేష్ శివన్ దర్శకుడిగా ఒక మెట్టు ఎక్కినట్లే.