అజిత్ సినిమాపై కరోనా ఎఫెక్ట్

తమిళ హీరో అజిత్ నటిస్తున్న ‘వలిమై’ సినిమా అప్డేట్ గురించి అతని అభిమానులు గత ఆర్నెళ్లుగా గోల గోల చేస్తున్నారు. దాంతో అజిత్ పుట్టిన రోజు స్పెషల్ గా మే 1న ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దాంతో అజిత్ ఫ్యాన్స్ కూల్ అయ్యారు. ఐతే, ఇప్పుడు వాళ్ళకి కరోనా షాక్ ఇచ్చింది.

దేశమంతా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇలాంటి టైంలో ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడం కరెక్ట్ కాదని ఇప్పుడు ఫస్ట్ లుక్ వాయిదా వేశారట. కరోనాతో సినిమా విడుదలలు వాయిదా పడడమే కాదు ఫస్ట్ లుక్, టీజర్లు కూడా పొస్టుపోన్ అవుతున్నాయి.

ఈ మే1న అజిత్ 50వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటాడు.

More

Related Stories