అజిత్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే

Valimai


తమిళ హీరో అజిత్ నటిస్తున్న ‘వలిమై’ సినిమా సంక్రాంతి బరిలో నిల్చింది. తెలుగులో ఈ సినిమాకి పెద్దగా సీను ఉండదు కానీ తమిళనాట మాత్రం విపరీతమైన క్రేజుంది. తాజాగా ఈ సినిమా నుంచి చిన్న వీడియో విడుదలైంది. యాక్షన్ స్టంట్లు అదిరిపోయాయి. అజిత్ నిజజీవితంలో కూడా రేసర్. బైక్, కారు రేసింగ్ లలో పాల్గొంటాడు.

“వలిమై”లో కూడా అలాంటి పాత్రే చేస్తున్నాడు అజిత్. ఈ వీడియోలో బైక్ రేసులు, ఆ స్టంట్లు చూపించారు. అవి మాములుగా లేవు. బాక్సాఫీస్ వద్ద గట్టిగానే కొట్టేలా ఉన్నాడు. ఈ సినిమాకి వినోద్ దర్శకుడు. ఈ డైరెక్టర్ ఇంతకుముందు కార్తీ హీరోగా “ఖాకీ” వంటి వైవిధ్యమైన చిత్రాన్ని తీశారు. “వలిమై” వీడియో చూస్తే అతని మార్క్ కనిపిస్తోంది.

మన తెలుగు చిత్రాలు తమిళనాడులో సంక్రాంతికి సందడి చెయ్యడం కష్టమే. అక్కడ అజిత్, విజయ్ సినిమాల హంగామా ఎక్కువగా ఉంటుంది ఈ సారి.

 

More

Related Stories