‘చోర్ బజార్’లో ఆకాష్ పూరి

Chor Bazaar

పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి ఇప్పటికే ‘మెహబూబా’, ‘రొమాంటిక్’ అనే రెండు సినిమాల్లో నటించాడు. రెండో సినిమా ఇంకా విడుదల కాలేదు. ఇప్పుడు మూడో చిత్రాన్ని మొదలుపెట్టాడు. “జార్జ్ రెడ్డి” సినిమా తీసిన దర్శకుడు జీవన్ రెడ్డి దీనికి డైరెక్టర్. “చోర్ బజార్” అనే టైటిల్ ను ఖరారు చేశారు.

టైటిల్ ని బట్టి కథను ఊహించొద్దు, ఊహకందని మలుపులు ఉంటాయంట.

గురువారం హైదరాబాద్ లోని ప్రొడక్షన్ ఆఫీస్ లో లాంఛనంగా ప్రారంభమైంది ఈ మూవీ. హీరో ఆకాశ్ పై సోదరి పవిత్ర పూరి క్లాప్ ఇవ్వగా తల్లి లావణ్య కెమెరా స్విచ్చాన్ చేశారు. వీఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానుంది.

More

Related Stories