అఖండ 2 మొదలు కానుంది!

Akhanda

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన “సింహా”, “లెజెండ్”, “అఖండ” ఒకదాని మించి ఒకటి హిట్టయ్యాయి. అందుకే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కి మంచి క్రేజుంది. అంతేకాదు బోయపాటి ఒక్క బాలయ్యతో తప్ప మిగతా హీరోలతో హిట్ కొట్టలేడు అనే ముద్ర ఉంది. నిజానికి అల్లు అర్జున్ తో “సరైనోడు”, వెంకటేష్ తో “తులసి”, రవితేజతో “భద్ర” వంటి హిట్స్ ఇచ్చాడు బోయపాటి. కానీ బోయపాటి “టేకింగ్”కి బాలయ్య కరెక్ట్ మిగతావాళ్ళు బలయ్యే వాళ్ళే అన్నట్లుగా జనంలో ఇమేజ్ ఉంది.

సో, నాలుగోసారి వీరి కాంబినేషన్ సెట్ అయింది. ఐతే ఈసారి అల్లు అరవింద్ కి చెందిన గీతా ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం. ఆహా కోసం బాలయ్య “అన్ స్టాపబుల్” షో చెయ్యడం, అది హిట్ కావడంతో అల్లు అరవింద్, బాలయ్య మధ్య బంధం గట్టి పడింది. బాలయ్యతో తమ బ్యానర్ లో సినిమా తీస్తామని అల్లు అరవింద్ ఇంతకుముందే ప్రకటించారు.

అల్లు అర్జున్ తో సినిమా తీయాలనే ఆలోచనతో గీతా క్యాంప్ కి వచ్చిన బోయపాటి అల్లు అరవింద్ ఇలా “అఖండ 2” సెట్ చేశారని టాక్.

త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చినప్పుడు బాలయ్య – బోయపాటి సినిమా మొదలవుతుంది.

Advertisement
 

More

Related Stories