అఖండ, ఆచార్య… రెండూ అంతే!

- Advertisement -


నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ కూడా ఒక పాట మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకొంది. కానీ, వీటి విడుదల తేదీ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు.

బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ’ నుంచి రెండు టీజర్లు వచ్చాయి. ఒక పాట విడుదలయ్యింది. శివ కొరటాల తీస్తున్న ‘ఆచార్య’ నుంచి ఒక టీజర్, ఒక పాట విడుదల అయ్యాయి. దసరా బరిలో ఉండాల్సిన ఈ సినిమాలు రిలీజ్ డేట్ కోసం అష్టకష్టాలు పడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు, సెకండ్ షోల పునరుద్ధరణ వంటి అంశాలపై క్లారిటీ రావాలి. అలాగే, సంక్రాంతికి ఎన్ని సినిమాలు వస్తాయి, ఎన్ని వాయిదా పడుతాయో లెక్క తేలాలి. అందుకే, ఈ రెండు సినిమాల మేకర్స్ తమ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చెయ్యడం లేదు.

రెండింటిపై మంచి అంచనాలున్నాయి. ‘అఖండ’ హిట్ కాంబినేషన్లో వస్తోంది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘సింహ’, లెజెండ్’ భారీ విజయాలు సాధించాయి. ఇక ‘ఆచార్య’ శివ కొరటాల, మెగాస్టార్ మూవీ. ఇందులో రామ్ చరణ్ కూడా నటించాడు. అంటే మెగా మల్టీస్టారర్ ఇది. బిజినెస్ టార్గెట్ 200 కోట్లపైనే ఉంది.

 

More

Related Stories