అఖండ సెన్సార్… కట్స్ కొన్నే!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో రూపొందిన మూడో చిత్రం… ‘అఖండ’. ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తి అయ్యాయి. సెన్సార్ కూడా పెద్దగా కట్స్ చెప్పకుండానే క్లియరెన్స్ ఇచ్చింది. ఈ సినిమాకి ‘యుఏ’ సర్టిఫికెట్ వచ్చింది.

రెండు గంటల 45 నిమిషాల నిడివితో సాగే పెద్ద చిత్రం. ఈ సినిమాలో బాలకృష్ణది ద్విపాత్రాభినయం. అఘోర పాత్రలో బాలయ్య నట విశ్వరూపం చూపిస్తారని అంటున్నారు. ఈ పాత్రలో బాలయ్య ప్రదర్శించే ఆవేశం, అభినయమే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ.

బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించింది. తమన్ స్వరపరిచిన ఈ సినిమాకి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. డిసెంబర్ 2న విడుదల కానుంది.

ఈ సినిమా హిట్ కావడం దర్శకుడు బోయపాటికి అవసరం. ఇది హిట్ అయితే వెంటనే అల్లు అర్జున్ తో మూవీ చేసే అవకాశం వస్తుంది. ‘అఖండ’ రిజల్ట్ కోసం బన్నీ వెయిట్ చేస్తున్నారు. ఇంతకుముందు బాలయ్య, బోయపాటి కాంబినేషనలో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’ పెద్ద హిట్స్ అయ్యాయి. అందుకే, ‘అఖండ’పై భారీ అంచనాలున్నాయి.

Advertisement
 

More

Related Stories