హిందీలో అఖండ తుస్సుమంది!

Akhanda


‘అఖండ’ ఒక బాక్సాఫీస్ సంచలనం. నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో రూపొందిన ఈ మూవీ కరోనా అనంతర పరిస్థితుల్లో బ్రహ్మాండమైన విజయం సాధించింది. జనం ఊగిపోయారు. ఈ సినిమాలో భక్తి కోణం కూడా ఉంది. ‘అఖండ’గా బాలయ్య నటన, క్లైమాక్స్ లో డివోషనల్ టచ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

‘అఖండ’ బాలయ్య కెరీర్ కి మళ్ళీ ఊపు తెచ్చిన మాట నిజం. ఐతే, బాలీవుడ్ లో ఇప్పుడు డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు బాగా ఆడుతున్న నేపథ్యంలో ఈ సినిమాని ఇప్పుడు హిందీలో విడుదల చేశారు. ఈ వీకెండ్ ‘అఖండ’ ఇండియా అంతా విడుదలైంది.

ఐతే, విచిత్రంగా ఈ సినిమాని హిందీ ప్రేక్షకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా పూర్తిగా తుస్సుమంది.

బాలయ్యకి హిందీ మార్కెట్ పెద్దగా లేదు. పైగా, ఈ సినిమాకి ప్రచారం కూడా చెయ్యలేదు. ఆల్రెడీ ఓటిటిలో ఉంది. హిందీ ప్రేక్షకులు అక్కడే చూసి ఉంటారు. అందుకే, థియేటర్లో ఈ హిందీ వర్షన్ ని ఎవరూ పట్టించుకోలేదు.

 

More

Related Stories