డిసెంబర్ డేట్ కే బాలయ్య!

Adiga Adiga Song


నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తోన్న ‘అఖండ’ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ఇప్పటికీ అన్ని పనులు పూర్తిచేసుకొని రెడీగా ఉంది. ఈ దీపావళికి మరో టీజర్ రానుంది ‘అఖండ’ నుంచి. ఆ తర్వాత నాలుగు రోజులకు రెండో పాట విడుదల కానుంది. అంటే.. ‘అఖండ’ సినిమా ప్రమోషన్లు మొదలయ్యాయి.

డిసెంబర్ 2ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంది. విడుదల తేదీని రేపో, ఎల్లుండో ప్రకటిస్తారు.

ఈసారి డిసెంబర్ నెలలో ప్రతివారం ఒక భారీ సినిమా రానుంది.

ఇప్పటికే వరుణ్ తేజ్ నటిస్తోన్న ‘గని’, ‘అఖండ’ డిసెంబర్ మొదటి వారంలో విడుదలైతే, ‘పుష్ప’ మూడో వారంలో , ‘శ్యామ్ సింగ రాయ్’,ఖిలాడీ’ చివరి వారంలో విడుదల కానున్నాయి. రెండో వారం మాత్రం ఖాళీగా ఉంది ప్రస్తుతానికి.

Advertisement
 

More

Related Stories