రెండోసారి ఆకట్టుకున్న అఖండ

Akhanda

థియేటర్లలో సూపర్ హిట్టయిన అఖండ సినిమా, బుల్లితెరపై కూడా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సిల్వర్ స్క్రీన్ పై బ్లాక్ బస్టర్ హిట్టయిన ఈ సినిమా.. బుల్లితెరపై కూడా 13 టీఆర్పీతో అఖండ విజయం సాధించింది. అయితే ఇదంతా పాత లెక్క. ఇప్పుడు కొత్త మేటర్ ఏంటంటే.. వరుసగా రెండో సారి కూడా స్మాల్ స్క్రీన్ పై ఈ సినిమా హిట్టయింది.

ఈ నెలలో మరోసారి అఖండ సినిమాను ప్రసారం చేసింది స్టార్ మా ఛానెల్. అలా రెండోసారి టీవీల్లోకి వచ్చిన ఈ సినిమాకు ఏకంగా 7.3 టీఆర్పీ వచ్చింది. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల తర్వాత రెండో సారి కూడా భారీ రేటింగ్ దక్కించుకున్న సినిమాగా నిలిచింది అఖండ.

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అఖండ సినిమా, థియేట్రికల్ వ్యవస్థకు ఆక్సిజన్ అందించింది. ఈ సినిమా సక్సెస్ తర్వాతే థియేట్రికల్ మార్కెట్ పై అందరికీ నమ్మకం కుదిరింది. ఇక అక్కడ్నుంచి టాలీవుడ్ గాడిన పడింది.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ‘అఖండ’ విజయంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. 

 

More

Related Stories