‘అఖండ’ కూడా ఆగస్టుకి వాయిదా!

Balakrishna and Pragya

కరోనా రెండో వేవ్ కారణంగా అన్ని సినిమాలు వాయిదాపడ్డాయి. అన్ని చిత్రాలు తమ సినిమాలను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఇంకా, బాలకృష్ణ టీం నుంచి మాత్రం ప్రకటన రాలేదు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం.. ‘అఖండ’. ఈ సినిమాని మే 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ అది ఇప్పుడు సాధ్యపడదు.

తాజా సమాచారం ప్రకారం ‘అఖండ’ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట బోయపాటి. అప్పటికి పరిస్థితులు అనుకూలిస్తే… ‘అఖండ’ థియేటర్లోకి వచ్చేస్తుంది. లేదంటే… వెయిట్ చెయ్యాలిసిందే!

ఈ సినిమాకి మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. టైటిల్ టీజర్ కి ఇప్పటివరకు 53 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. బాలకృష్ణ సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

More

Related Stories