బోయపాటి మార్క్ అదిరిందిగా

Akhanda

బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం… “అఖండ”. వీరి కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకులు అంచనాలు ఎక్కువగా పెంచుకుంటారు. బోయపాటి కూడా బాలయ్య సినిమా అంటే కేర్ ఎక్కువగా తీసుకుంటాడని మరోసారి అఖండ టైటిల్ టీజర్ తో అర్థమైంది. టీజర్ అదిరిపోయింది.

బాలయ్య ఇంతవరకు ఈ గెటప్ లో ఎప్పుడూ కనిపించలేదు. ఏ బడా హీరో ఇలా దర్శనమివ్వలేదు. ఆ లుక్ తోనే బోయపాటి మార్కులు కొట్టేశాడు. ఇక బాలయ్య అభిమానులు కోరుకునే పంచ్ డైలాగ్ కూడా అదిరిపోయింది.

“కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది… కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది…’ అంటూ హై వోల్టేజ్ తో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ కి బాలయ్య అభిమానులు మురిసిపోతున్నారు.

ఈ టీజర్, ఈ టైటిల్, ఈ లుక్ తో బోయపాటి తన మార్క్ ఏంటో చూపించాడు. ఒక్కసారిగా వీరి కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇంతకముందు వచ్చిన ‘లెజెండ్’, ‘సింహ’ చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

Akhanda | #BB3 Title Roar | Nandamuri Balakrishna | Boyapati Srinu | Thaman S | Dwaraka Creations

More

Related Stories