నిజంగా ‘గ్యాంబ్లింగ్’ చేస్తున్నారా?

Akhanda

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ టైటిల్ టీజర్ అనూహ్యంగా వ్యూస్ పొందుతోంది. ఇప్పటికే 40 మిలియన్ల వ్యూస్ అందుకొంది. 12 రోజుల్లోనే 43 లక్షల వ్యూస్ రావడం అంటే గ్రేట్. త్వరలోనే అరకోటి అందుకుంటుంది. ఇతర పెద్ద సినిమాలకు సాధ్యం కాలేదు కానీ బాలయ్య మూవీకి ఎలా పాజిబుల్ అనేది చాలా మందికి మిస్టరీగా మారింది.

మార్కెటింగ్ టెక్నీక్ తో వ్యూస్ తెప్పించుకుంటున్నారనేది ఒక ఆరోపణ. కొన్ని మీడియాల్లో ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి. ఇందులో నిజమెంత అనేది తెలియాలి.

డబ్బులతో అన్ని వ్యూస్ తెప్పించుకుంటే … మిగతా సినిమాలకు కూడా అలాగే రావాలి కదా అనే డౌట్ కూడా ఉంది. మొదటి రోజు ఇన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయని సోషల్ మీడియాలో డప్పు వేసుకోవడానికి అన్ని పెద్ద సినిమాలు వ్యూస్ ని కొంటాయి.

దాదాపు ప్రతి పెద్ద స్టార్, ప్రతి ‘పాన్ ఇండియా’కి ఇదే జరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంతగా పాపులర్ అయ్యాయి అంటే అదే కారణం. దానికి రకరకాల పద్ధతులుంటాయి. కొన్నేళ్ల క్రితం ఒక పెద్ద సినిమా ఈ పద్దతిని ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు అందరూ అదే ఫాలో అవుతున్నారు. ఐతే, రెండు, మూడు రోజుల తర్వాత ఈ టెక్నీక్ ని కొనసాగించరు. ఎందుకంటే ఆ తర్వాత ఖర్చు తప్ప ఉపయోగం ఉండదు… సహజ పద్దతిలో (ఆర్గానిక్) వ్యూస్ రావాలని వదిలేస్తారు.

బోయపాటి తీసిన ‘అఖండ’ మాత్రం పది రోజులు దాటిన తర్వాత కూడా మిలియన్ల కొద్దీ వ్యూస్ యాడ్ చేసుకుంటోంది. అందుకే, అటు పూర్తిగా మార్కెటింగ్ గిమ్మిక్ అనలేని పరిస్థితి. ఇటు, ఈ టీజర్ జనాలకు అంత నచ్చిందా అన్నది డౌటే.

More

Related Stories