ఇప్పుడు పెళ్లి ఆలోచన లేదు

హీరో అఖిల్ తన పెళ్లి గురించి వస్తున్న రూమర్లపై స్పందించాడు. అఖిల్ హీరోగా అడుగుపెట్టిన మొదటి సినిమా విడుదల కాగానే పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. ఒక అమ్మాయితో ఎంగేజ్ మెంట్ అయి క్యాన్సిల్ అయింది.

లేటెస్ట్ గా అఖిల్ పెళ్లి గురించి మరోసారి ప్రచారం జరుగుతోంది. “అవన్నీ రూమర్స్. ఇప్పుడు పెళ్లి ఆలోచన లేదు. నేను సింగిల్. ఎవరితో ప్రేమలో లేను,” అని అఖిల్ వివరించాడు.

తన దృష్టిలో నిజమైన లవ్ ఆటలే అని అఖిల్ సమాధానమిచ్చారు. అఖిల్ కి స్పోర్ట్స్ అంటే తెగ ఇష్టం. క్రికెట్ కూడా బాగా ఆడుతాడు. ఒక స్పోర్ట్స్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్వూలో ఈ విషయాలు చెప్పాడు.

మరోవైపు, ‘ఏజెంట్’ సినిమా ఏప్రిల్ నుంచి వాయిదా పడినట్లు టాక్. ఈ షూటింగ్ పూర్తికాకపోవడమే కారణం.

 

More

Related Stories