అఖిల్ సినిమాదీ ‘భారీ బడ్జెట్టే’

అఖిల్ అక్కినేని కెరీర్ లోనే అతిపెద్ద బడ్జెట్ సినిమా… ఏజెంట్. కానీ, ఈ సినిమా థియేటర్ ల నుంచి పెట్టిన పెట్టుబడిలో 10 శాతం కూడా రాబట్టలేదు. దాంతో, అఖిల్ అక్కినేనితో భారీ బడ్జెట్ సినిమాలు తీసి చేతులు కాల్చుకునే బదులు కాన్సెప్ట్ తో మంచి మీడియం బడ్జెట్ చిత్రాలు తీసుకోవడం బెటర్ అనేది ఒక అనాలిసిస్.

ఐతే, నిర్మాతలు మాత్రం తగ్గడం లేదు. అఖిల్ అక్కినేని పెద్ద హీరో అయ్యే స్టామినా ఉందని ఇంకా కొందరు నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే, యువీ క్రియేషన్స్ సంస్థ తమ తదుపరి చిత్రాన్ని అఖిల్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్టే.

‘ధీర’ అనే పేరుని పరిశీలిస్తున్నారు. కొత్త దర్శకుడు తీసే ఈ సినిమా విషయంలో బడ్జెట్ తగ్గించేది లేదని అంటున్నారు. అఖిల్ రేంజ్ కి ఎక్కువే ఖర్చు పెట్టనున్నారు. ఈ సినిమాతో అఖిల్ భారీ హిట్ అందుకోవడం ఖాయం అనేది ఆ సంస్థ గట్టి నమ్మకం. బాలీవుడ్ బడా హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు. జాన్వీ కపూర్ ఇప్పటికే బయటికి వచ్చింది. కానీ జాన్వీకి బదులు మరో యువ అగ్ర బాలీవుడ్ భామ కోసం ప్రయత్నిస్తున్నారు.

ఇది కూడా తెలుగుతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ కానుంది.

Advertisement
 

More

Related Stories