అఖిల్ కాళ్లు విరగ్గొట్టి పెళ్లి చేస్తాం!

అఖిల్ కాళ్లు విరగ్గొట్టి పెళ్లి చేస్తాం!

బిగ్ బాస్ హౌజ్ లో నడుస్తున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ముందుగా అభిజిత్-మోనాల్ కనెక్ట్ అయ్యారు. మోనాల్ కోసం ఓ రేంజ్ లో పులిహోర కలిపాడు అభిజీత్. దీంతో వీళ్లు మరో “రాహుల్-పునర్నవి జంట”గా మారుతారని చూసిన ప్రేక్షకులు అనుకున్నారు. కానీ అంతలోనే సీన్ లోకి అఖిల్ ఎంటరయ్యాడు.

అఖిల్, మోనాల్ కు దగ్గరైన తర్వాత హౌజ్ రచ్చరచ్చ అయింది. మోనాల్ కోసం అభిజీత్ పరితపించడం.. అఖిల్ ఏమో మోనాల్ ను వదలకుండా ఆమెతోనే ఎక్కువగా గడపడం.. చివరికి హౌజ్ లో కంటెస్టెంట్లు కూడా వీళ్ల ట్రయాంగిల్ ప్రేమపై సెటైర్లు వేయడంతో షో మంచి రసకందాయంలో పడింది.

ఈ నేపథ్యంలో అఖిల్ తల్లిదండ్రులు స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తమ కొడుకు అఖిల్, హౌజ్ లో చేస్తున్న పనులపై అతడి పేరెంట్స్ రియాక్ట్ అయ్యారు. షో ముగిసి అఖిల్ ఇంటికొచ్చిన వెంటనే అతడి కాళ్లు విరగ్గొట్టయినా పెళ్లి చేసేస్తామని అఖిల్ తల్లి ప్రకటించింది.

అటు అఖిల్ తండ్రి కూడా దాదాపు అదే సమాధానం ఇచ్చారు. హౌజ్ లోకి ఎంటరవ్వకముందే అఖిల్ నుంచి తాము మాట తీసుకున్నామని, బయటకొచ్చిన వెంటనే కొడుకు పెళ్లి చేసేస్తామని, కచ్చితంగా తెలంగాణ పిల్లే తమకు కోడలిగా వస్తుందని, గుజరాతీ పిల్ల కాదని కుండబద్దలు కొట్టాడు. పరోక్షంగా అఖిల్-మోనాల్ లవ్ ఎఫైర్ కు బ్రేకులేశాడు.

More

Related Stories