అఖిల్ కండల కసరత్తు దేనికో!

తన నుంచి ది బెస్ట్ రాబోతోందని ప్రకటించాడు యంగ్ హీరో అఖిల్. ఎక్స్ ట్రీమ్లీ స్పెషల్ కోసం ప్రయత్నం మొదలైందని అంటున్నాడు. సరికొత్త మేకోవర్ కోసం కసరత్తులు షురూ చేశాడు అక్కినేని అఖిల్. వర్కవుట్స్ చేస్తున్న 2 ఫొటోల్ని కూడా వదిలాడు.

అంతా బాగానే ఉంది కానీ, ఉన్నఫలంగా ఇప్పటికిప్పుడు అఖిల్ ఎందుకీ మేకోవర్ ఛాలెంజ్ తీసుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి కండలు చూపించడం అఖిల్ కు కొత్త కాదు. మొదటి సినిమాలోనే సిక్స్ ప్యాక్ చూపించాడు. ఈసారి మరింత బెస్ట్ వెర్షన్ చూపిస్తానని, సరికొత్త ట్రాన్స్ ఫర్మేషన్ ఉంటుందని ఊరిస్తున్నాడు. ఇంత అర్జెంట్ గా ఇదంతా ఎందుకనేది అందరి అనుమానం.

ప్రస్తుతం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ మూవీ తర్వాత అతడు చేయబోయే సినిమా ఏంటనేది అఫీషియల్ గా బయటకు రాలేదు కానీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఈ మూవీ కోసమే అఖిల్ ఇలా స్పెషల్ మేకోవర్ ట్రై చేస్తున్నాడేమో.

Related Stories