అఖిల్ సినిమా ఓటీటీ డీల్ లాక్

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఏజెంట్ సినిమా. అఖిల్ కెరీర్ లో మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ ఇది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి నాన్-థియేట్రికల్ డీల్ ఒకటి క్లోజ్ చేశారు. ఏజెంట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకుంది. ఏ రేటుకు ఈ డీల్ లాక్ అయిందనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఏజెంట్ సినిమా. ఇందులో అఖిల్, ఇంటర్ పోల్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. దీని కోసం పూర్తిస్థాయిలో మేకోవర్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ సాధించడంతో పాటు హెయిర్ స్టయిల్ కూడా మార్చాడు. ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఆ మధ్య చాలా పుకార్లు వచ్చాయి. సినిమా షూటింగ్ ఆగిపోయిందని కొంతమంది, నిర్మాతగా సురేందర్ రెడ్డి తప్పుకున్నాడని మరికొంతమంది, ఆర్థిక సమస్యల్లో ఉందని ఇంకొందరు రకరకాల కట్టుకథలు అల్లారు. అయితే అలాంటివేం లేదని నిర్మాత ఈమధ్య క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మనాలీలో జరుగుతోంది. సాక్షి వైద్య ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతోంది. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు.

 

More

Related Stories