అన్న కోసం తప్పుకున్న తమ్ముడు

అక్కినేని అన్నదమ్ముల మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగింది. అన్న సంక్రాంతికి థియేటర్లలోకి వస్తున్నాడు. అన్నయ్య కోసం తమ్ముడు రేసు నుంచి తప్పుకున్నాడు. నాగచైతన్య-అఖిల్ సినిమాల మధ్య ఒప్పందం ఇది.

నాగచైతన్య చేస్తున్న సినిమా “లవ్ స్టోరీ”. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని ఎక్కడా ప్రకటించలేదు. అయితే అఖిల్ నటిస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా మాత్రం సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందని మేకర్స్ స్వయంగా ప్రకటించారు.

అయితే ఇప్పుడు సిచ్యుయేషన్ రివర్స్ అయింది. అఖిల్ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాడు. అదే సీజన్ కు నాగచైతన్య సినిమాను రిలీజ్ చేయాలనేది ప్లాన్.

ఈ మేరకు తన సినిమా సంక్రాంతికి రాదని అఖిల్ స్వయంగా ప్రకటించాడు. సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత జనవరి 21న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను విడుదల చేస్తామంటూ, తన సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించాడు.

Related Stories