ఆమెని తెగ పొగిడిన అఖిల్

Akhil

హీరో అఖిల్ కి పెళ్లి కుదిరింది అని, వదిన సమంత ఈ సారి సంబంధం సెట్ చేసింది అని గత వారం రోజులుగా ఊహాగానాలు సాగుతున్నాయి. గతంలో అఖిల్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఏవో కారణాల వల్ల వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి వార్తలు షికార్లు చేస్తుండడంతో అఖిల్ ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అప్ డేట్స్ వైపు అందరూ చూపు వేశారు.

లేటెస్ట్ గా అఖిల్ ఒక అమ్మాయితో సెల్ఫీ దిగిన ఫోటో ఇన్ స్టాగ్రామ్ లో పెట్టడంతో ఆసక్తి కలిగింది. కానీ ఈ అమ్మాయి అతని పర్సనల్ డైటీషియన్. కైరవి అనే ఈ డైటీషియన్ చెప్పిన ఆహారమే ఏడాదిగా తీసుకుంటున్నాడట. ఆమె ఇచ్చిన సలహాల వల్ల తన బాడీ ఇప్పుడు పర్ఫెక్ట్ గా మారిందట. అందుకే ఆమెకి థాంక్స్ చెప్తూ ఈ పోస్ట్ పెట్టాడు.

అఖిల్ ఇప్పుడు కండలు పెంచుకుంటున్నాడు తన కొత్త సినిమా కోసం. సో, ఆమె చెప్తున్న మెనూ బాగా వర్క్ అవుట్ అవుతున్నట్లు ఉంది. ఇప్పుడు పెళ్లి రూమర్లు సాగుతున్న టైములో …. కైరవిని చూసి ఆమె కాబోయే భార్య అనుకునే ప్రమాదం ఉంది. అందుకే డిటైల్డ్ గా వివరణ కూడా ఇచ్చాడు.

Related Stories