
బెంగుళూరుకి చెందిన అక్షర గౌడ ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించింది. ఈ భామకి ఇన్ స్టాగ్రామ్ లో తెగ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే, ఆమె పెట్టే ఫోటోలు అలాంటివి. మొత్తం అందాల ఆరబోత ఉంటుంది.
ఇన్ స్టాగ్రామ్ ఫోటోషూట్ కోసం ఓవర్ గా ఎక్స్ పోజింగ్ చేసే ఈ భామ తెలుగు సినిమాల్లో మాత్రం పూర్తిగా ‘సైడ్ క్యారెక్టర్లు’ చేస్తోంది.
“మన్మధుడు 2” సినిమాలో చిన్న పాత్ర దక్కించుకొంది. “ది వారియర్” సినిమాలో విలన్ గా నటించిన ఆది పినిశెట్టికి భార్యగా నటించింది. తాజాగా “దాస్ కా ధమ్కీ”లో స్టార్ హోటల్ మేనేజర్ పాత్రలో కనిపించింది. ఇది చిన్న పాత్ర.
ఐతే, తనకి హీరోయిన్ గా సరైన పాత్రలు ఇస్తే సినిమాల్లో కూడా గ్లామర్ ఒలకబోస్తాను అంటోంది. పేరున్న సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి కానీ మెయిన్ లీడ్ గా రావట్లేదని ఈ భామ బాధపడుతున్నట్లు కనిపిస్తోంది.

ALSO CHECK: Akshara Gowda’s sizzling avatar