ఫిబ్రవరిలో వస్తున్న అక్షర

Akshara

చిన్న సినిమాలన్నీ OTT వైపు చూపు వేస్తున్న తరుణంలో నందితశ్వేతా నటించిన ఒక మూవీ థియేటర్లోనే విడుదలకు రెడీ అవుతోంది. ఆమె యాక్ట్ చేసిన ‘అక్షర’ షూటింగ్ పూర్తి చేసుకొంది. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ నిర్మించిన ‘అక్షర’ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.

ఈ సినిమా చాలాకాలంగా షూటింగ్ లో ఉంది. కరోనా కారణంగా లాస్ట్ ఇయర్ విడుదల కాలేదు. “ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు ఆఫర్లు వచ్చాయి కానీ ఈ సినిమాను థియేటర్లలోనే ఎక్స్ పీరియన్స్ చేయాలని ఇప్పటివరకు వెయిట్ చేశాం. ఇప్పుడు పరిస్థితులన్ని చక్కబడ్డాయి కాబట్టి ఫిబ్రవరి నెలలో థియేటర్లలోనే రిలీజ్ చేయబోతున్నా”మని అంటున్నారు నిర్మాతలు.

More

Related Stories