
అల్లు అర్జున్ కెరీర్ లో ఒక మైలురాయి …’అలా వైకుంఠపురంలో’. ఈ సినిమా విజయం బన్నీ రేంజును అమాంతం పెంచేసింది. అదే ఊపులో పాన్ ఇండియా మంత్రం వల్లిస్తూ సుకుమార్ డైరెక్క్షన్ లో “పుష్ప” మొదలుపెట్టారు అల్లు అర్జున్. ఇప్పుడు, పాటలు విడుదల చేసేందుకు అంతా రెడీ అయింది.
‘అలా వైకుంఠపురంలో’ సినిమా పాటల ప్రమోషన్ ని ఐదు నెలల ముందే పెట్టారు. మొదటి పాట హిట్ కాగానే సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ సినిమాకి ఐదారు నెలల ముందే పాటలు విడుదల చేసినట్లే ‘పుష్ప’ సినిమాకి అలాగే చేస్తున్నారు. ‘పుష్ప’ మొదటి పాట ఈ నెల 13న విడుదల కానుంది.
సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు కానీ ఐతే ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది కానీ రిలీజ్ అవుతుంది. ముందే పాటల ప్రొమోషన్ షురూ అన్నమాట. “దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుతోంది పీక” అని చంద్రబోస్ రాసిన పాటను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. ఆ పాట August 13న రిలీజ్ అవుతుంది.
‘అల వైకుంఠపురంలో’ నుంచి ‘సామజవరాగమన’ పాట ఫస్ట్ వచ్చి వైరల్ అయింది. ఒక సినిమా సక్సెస్ మంత్రాన్ని ఫాలో అవడమే మంచి పద్దతి కదా. అలా వెళ్తోంది ‘పుష్ప’ టీం.