8 నెలల తర్వాత టీవీలో

“అల వైకుంఠపురములో” సినిమాతో ఇప్పటికే కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో కేవలం తన కెరీర్ పరంగానే కాకుండా.. టాలీవుడ్ లో కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. సంక్రాంతికి విడుదల అయింది ఈ మూవీ. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో మూడు నెలల తర్వాత రిలీజ్ అయింది. కానీ బుల్లితెరపై ప్రీమియర్ కావడానికి 8 నెలల టైం తీసుకొంది.

ఇప్పుడు బుల్లితెర రికార్డులపై కన్నేశాడు బన్నీ. ఈరోజు స్మాల్ స్క్రీన్ పైకి రాబోతోంది. సాయంత్రం జెమినీ టీవీలో ప్రసారం కాబోతోంది. ఈ సినిమాతో టీఆర్పీ మోత మోగిపోతుందని చాలామంది అంచనా వేస్తున్నారు.

ఎందుకంటే.. “అల వైకుంఠపురములో” అనే సినిమా ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. దీనికి తోడు ప్రతి పాట సూపర్ హిట్టు. త్రివిక్రమ్ డైలాగ్స్, బన్నీ స్టామినా అదనపు అడ్వాంటేజ్. ఇవన్నీ తోడై ఈ సినిమా రేటింగ్స్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అంతా భావిస్తున్నారు. మహేష్ సంక్రాంతి సినిమా “సరిలేరు నీకెవ్వరు”కు టీవీల్లో రికార్డ్ బ్రేకింగ్ రేటింగ్ వచ్చింది. ఇప్పుడా రేటింగ్ ను బన్నీ టచ్ చేస్తాడేమో చూడాలి.

ఒకవేళ, ఆలా చెయ్యలేకపోతే, మహేష్ బాబు ఫాన్స్ నుంచి ట్రోలింగ్ మామూలుగా ఉండదు.

Related Stories