
నటుడు అలీకి రాజ్యసభ సీటు దక్కనుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారట. ఇటీవల జగన్ మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ వంటి పెద్ద స్టార్స్ కలిశారు. వారితో పాటు వైసీపీ నాయకుడిగా అలీ కూడా వెళ్లారు.
ఆ సమయంలోనే పదవి గురించి హింట్ ఇచ్చారట సీఎం జగన్. రాజ్యసభ పదవి ఇస్తారా లేదా ఇంకా ఏదైనా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆ తీపి కబురు కోసం అలీ వెయిట్ చేస్తున్నారు.
గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలీ వైఎస్సార్సీ పార్టీలో చేరారు. ఆ పార్టీ విజయానికి తనవంతు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అలీకి నటుడిగా పెద్ద అవకాశాలు లేవు. బుల్లితెరపైనే హోస్ట్ గా సందడి చేస్తున్నారు. రాజ్యసభ ఎంపీగా ఎన్నికైతే ఆయన కల నెరవేరుతుంది.
ఐతే, వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉందని గట్టి టాక్.