నా భర్త మంచివాడు: అలియా

- Advertisement -
Alia Stills 151123 001

అలియా భట్ తన భర్త రణబీర్ గురించి మరోసారి మాట్లాడింది. “రణబీర్ గురించి జనం అనుకునేదంతా తప్పు. ఆయన చాలా మంచివారు. ఓపెన్ మైండెడ్. నేను వేరే అర్థంలో చెప్పిన ఒక మాటని తీసుకొని అతను “టాక్సిక్” మెంటాలిటీ ఉన్న వారని సోషల్ మీడియాలో ట్రెండ్ చెయ్యడం చాలా బాధేసింది. అందుకే, రణబీర్ గురించి ఇక ఎక్కువ మాట్లాడదల్చుకోలేదు,” అని చెప్తోంది.

“నాకు నా భర్తే ప్రపంచం. నా కూతురు, నా భర్తతో నా లైఫ్ అనందంగా సాగుతోంది. నా మాటలను వక్రీకరించి రకరకాల రాతలు రాసేవారి గురించి వర్రీ కావొద్దు అని ఫిక్స్ అయ్యాను,” అని అలియా తాజాగా వెల్లడించింది.

అలియా భట్ కి సోలోగా మంచి స్టార్డం ఉంది. పెళ్లి తర్వాత కూడా పెద్ద హిట్స్ అందుకొంది. తన పేరు మీద ఓపెనింగ్ రాబట్టిగలిగే హీరోయిన్. ఇక ఆమె భర్త రణబీర్ కపూర్ సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు. ఇన్ స్టాగ్రామ్ లో కానీ, ట్విట్టర్ లో కానీ పర్సనల్ ఎకౌంట్ లేదు అతనికి.

“అదే సమస్య అయింది. ఆయన వివరణ ఇచ్చేందుకు వేదిక లేదు. అందుకే నేను ట్రోల్ అవుతాను,” అని అలియా భట్ చెప్తోంది.

More

Related Stories